నాగచైతన్య-సాయి పల్లవిని ఇమిటేట్ చేసిన బుల్లితెర స్టార్ కపుల్.. జలకులిచ్చే కామెంట్స్ వైరల్!!

బుల్లితెర ప్రేక్షకులకు ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-03-25 13:13 GMT

దిశ, సినిమా: బుల్లితెర ప్రేక్షకులకు ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ సీరియల్‌లోని డాక్టర్ బాబు-వంటలక్క కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇకపోతే ఈ సీరియల్ గత ఏడాది ముగియగా.. ప్రస్తుతం మళ్లీ కార్తీక దీపం సీరియల్ కు సీక్వెల్ వస్తుంది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

సినిమా లెవల్ లో ఇప్పటివరకు ఏ సీరియల్ కూడా నిర్వహించని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. హైదరాబాదులోని బంజారా హిల్స్ రోడ్ నెం. 2, ఎల్ వీ ప్రసాద్ ఆసుపత్రి పక్కన ఉన్న ప్రసాద్స్ లాబ్స్ వేదికన జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

అయితే అక్కినేని హీరో నాగచైతన్య-సాయిపల్లవి.. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా, వాలెంటైన్స్ డే సందర్భంగా నాగ చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ మూవీ నుంచి చిన్న గ్లింప్స్ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో చైతన్య.. ‘బుజ్జి తల్లి వచ్చేత్తున్న కదే.. కాస్త నవ్వవే అని ఎంతో ప్రేమగా అంటాడు.

దీనికి సాయిపల్లవి మొదట బాధ పడి.. తర్వాత నవ్వుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. తాజాగా దీనిపై కార్తీకదీపం సీరియల్ లోని డాక్టర్ బాబు-వంటలక్క రీల్ చేశారు. ఈ రీల్ నెట్టింట వైరల్ అవ్వగా నెటిజన్లు.. సూపర్ జోడి అని పొగడగా.. మరికొంతమంది మీరు చైతన్య-సాయి పల్లవి అనుకుంటున్నారా ఏమైనా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Similar News