టెన్త్ ఫలితాల్లో కర్నాటక టాపర్ రైతు బిడ్డకి సర్‌ఫ్రైజ్!.. గొప్ప మనసు చాటుకున్న 'కాంతార' హీరో
ప్రస్తుత కాలంలో గొప్ప ఇంటి నుంచి వచ్చిన పిల్లల కంటే పేదింటి పిల్లలే పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు.
దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో గొప్ప ఇంటి నుంచి వచ్చిన పిల్లల కంటే పేదింటి పిల్లలే పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలు రాసి చివరకు అనుకున్న లక్ష్యం చేరుకుని తమ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందానికి కారణం అవుతుంటారు. అలాంటి వారికి దేశ నలుమూలల నుంచి అభినందనలు తలెత్తుతాయి. అంతేకాక తమ విజయంతో సెలబ్రిటీల నుంచి కూడా అభినందనలు అందుకుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్న అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ కోవకి చెందిన విద్యార్థిని అంకిత బసప్ప పై పాన్ ఇండియా స్టార్ ప్రశంసలు కురిపించారు.
తాజాగా గురువారం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా బాగల్ కోట్ జిల్లాకు చెందిన అంకిత బసప్ప పదో తరగతి ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరు శాతం మార్కులు సాధించి అదరగొట్టింది. ఆమె తండ్రి బసప్ప ఒక రైతు, అలాగే తల్లి గృహిణి. ఆమె తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ బిడ్డను చదివిస్తున్నాడు. అయితే ఆమె ఎస్ఎస్సి(SSC) ఫలితాల్లో ఏకంగా 625/625 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఆమె కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఇక తన విజయం గురించి అంకిత స్పందించి.. తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించినట్లు తెలిపింది. అలానే భవిష్యత్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి.. తరువాత ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యమని తెలిపింది. ఇక అంకిత విజయం పట్ల కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి స్టేట్ టాపర్‌గా నిలిచిన విద్యార్ధి అంకితా ఫోటోను, ఆమె తల్లి, తండ్రుల ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు.
కాగా ప్రస్తుతం రిషబ్ శెట్టి ‘కాంతారా2’ లో నటిస్తున్నాడు.