బొద్దుగా ఉందని ఆ హీరోయిన్‌ను దారుణంగా ట్రీట్ చేసిన కరీన

బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ ఇతర హీరోయిన్స్‌పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడంలో ముందుంటుంది.

Update: 2023-06-06 11:22 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ ఇతర హీరోయిన్స్‌పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడంలో ముందుంటుంది. ఇలాంటి స్టేట్‌మెంట్స్ వల్లే ప్రియాంక చోప్రాతో సరైన రిలేషన్ మెయింటెన్ చేయలేని కరీన.. విద్యా బాలన్‌ గురించి కూడా ఇలాంటి మాటలు మాట్లాడి విమర్శలపాలైంది. తన ‘తాషన్’ చిత్రం విడుదలైన సమయంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బెబో.. ‘డర్టీ పిక్చర్’ కోసం బరువు పెరిగిన విద్యపై కామెంట్స్‌ చేసింది. ‘క్యారెక్టర్‌లో జీవించేందుకేనని చెప్తారు. కానీ లావుగా ఉండటం సెక్సీ కాదు. సన్నగా ఉండటం ఇష్టం లేదని చెప్పడం నిజంగా నాన్‌సెన్స్. ఇది ప్రతి ఆడపిల్ల కల. ఇప్పుడు కొంతమంది నటీమణులతో బొద్దుగా ఉండటం ట్రెండ్ కావచ్చు. కానీ నేను ఖచ్చితంగా బొద్దుగా లేదా లావుగా కనిపించాలని అనుకోను!’ అని చెప్పుకొచ్చింది. కాగా దీనిపై ఇప్పుడు స్పందిస్తున్న నెటిజన్స్.. ‘ ఈ ఓవరాక్షన్ వల్లే బాలీవుడ్‌ను బాయ్‌కాట్ చేయాల్సి వస్తుంది’ అని తిట్టిపోస్తున్నారు.

Read more: 18 ఏళ్ల అబ్బాయిలు, అమ్మాయిలు చేయకూడని తప్పులు ఇవే..!

సినిమా షూటింగ్ సమయంలో ఆ పార్ట్‌కి సర్జరీ చేయించుకోమన్నారు.. బాలీవుడ్ నటి వైరల్ కామెంట్స్

Tags:    

Similar News