‘మా’ నాకు సరైన బహుమతి ఇచ్చింది.. సస్పెన్షన్‌పై కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్
ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై టాలీవుడ్ నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది.
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై టాలీవుడ్ నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. దీంతో ‘మా’ అసోసియేషన్ కల్యాణిపై సస్పెన్షన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కల్యాణి..
‘‘ఎన్టీఆర్ అంటే నాకు గౌరవం. నేను కూడా ఆయన అభిమానినే. ఆయన్ని తక్కువ చేసి ఎక్కడ మాట్లాడలేదు. కానీ, శ్రీకృష్ణుడు రూపంలో విగ్రహం ఉండకూడదు అన్నాను. అంతే కానీ.. ఆయన విగ్రహ ఏర్పాటుకు నేను వ్యతిరేకిని కాదు. చిరంజీవి శివుడు, సుమన్ వెంకటేశ్వర స్వామి, నాగార్జున అన్నమయ్య, తాజాగా ప్రభాస్ రాముడు పాత్రలు చేశారు. రేపు వాళ్ల అభిమానులు కూడా అదే అవతారాల్లో విగ్రహాలు పెడతామంటారు. అప్పుడు ఏం చేస్తారు. నన్ను ‘మా’ నుండి సస్పెండ్ చేయడం చాలా బాధగా ఉంది. నేను పరిశ్రమ తరపున చాలా సార్లు మాట్లాడాను.. విమర్శలు ఎదుర్కొన్నాను. దానికి ‘మా’ అసోసియేషన్ సరైన బహుమతి ఇచ్చింది’’ అంటూ ఆమె ఆవేదన తెలియజేశారు.
Read More... Niharika Konidela : నిహారికతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు చైతన్య..!
షూటింగ్స్ లోకేషన్స్‌లో అదొక వ్యసనంగా మారిపోయింది.. శ్రీలీల కామెంట్స్ వైరల్