Sapthami Gowda: ప్రేమ లేకపోయినా ఉన్నట్లే నటించాలంటూ.. కొత్త ఫార్ములాను చెబుతున్న కాంతారా బ్యూటీ
దిశ, సినిమా: చిన్న మూవీగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన కాంతారా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో రిషబ్ శెట్టికి జోడిగా సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ అయినా అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ చేసి రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇదే సమయంలో ఈ భామ క్రేజ్ కూడా అమాంతం పెరిగింది.
ఆ మూవీ తర్వాత నుంచి వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సప్తమి రీసెంట్ గా ఓ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. దీనిలో ఆమె నిజ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ మాటలు ఇప్పుడు నెట్టింట హల్చల్ అవుతున్నాయి.
మీకు బాగా ఇష్టమైన క్రికెటర్ ఎవరని అడగగా విరాట్ కోహ్లీ అని అని చెప్పింది. తన చదువు మొత్తం బెంగళూరులోనే అని చెప్పుకొచ్చింది. ఇంత వరకు ఎవరితో ప్రేమలో పడలేదా? మీరు నటించిన నటులపై కూడా ప్రేమ కలగలేదా అంటూ యాంకర్ అడగగా.. ఆ ప్రశ్నకి సప్తమి గౌడ ఆసక్తికరమైన జవాబు ఇచ్చింది. సినిమా చూసే ప్రేక్షకులు కోసం ప్రేమ లేకపోయినా ఉన్నట్లే నటిస్తా.. ఎందుకంటే, ఆ ఎమోషన్ పలకడం కోసం.. నటించాలి తప్పదు. అలాగే నా జీవితంలో ప్రేమ, క్రష్ అలాంటివి ఏం లేవు. నా సహా నటులతో బ్రేకప్ సీన్ వచ్చినప్పుడు బ్రేకప్ అయినట్లే నటిస్తా అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై స్పందించిన నెటిజెన్స్ ఇలా కూడా నటించవచ్చని మీరు కొత్త ఫార్ములాను అమ్మాయిలకి చెబుతున్నారా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.