సినిమా షూటింగ్ చేసుకునేందుకు అక్కడ అనుమతివ్వాలంటూ కంగనా లేఖ
కంగనా రనౌత్ తరచూ వివాదాస్పద అంశాల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తారని మనకు తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: కంగనా రనౌత్ తరచూ వివాదాస్పద అంశాల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తారని మనకు తెలిసిందే. కాగా ఇటీవల కంగనా ఎమర్జెన్సీ అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కంగనా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే పార్లమెంట్లో సినిమా చిత్రీకరణ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కంగనా రనౌత్ లోక్ సభ సచివాలయాన్ని అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు. పార్లమెంట్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రైవేట్ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదు. కేవలం దూరదర్శన్, సంసద్ టీవీల షూటింగ్లకు అనుమతి ఉంది. అదీ సభాకార్యక్రమాల కోసం మాత్రమే కావడం విశేషం. ఈ నేపథ్యంలో కంగనా రిక్వెస్ట్ రిజెక్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ గురించి కంగనా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇందులో ఇందిరాగాంధీగా కంగనా కనిపించనున్నారు. సినిమాలో పార్లమెంట్ సన్నివేశాలు ఉండటంతో కంగనా దేశ పార్లమెంట్లోనే షూటింగ్ తీయాలని భావించారు.
ఇవి కూడా చదవండి :