అది ఎంత దుర్మార్గం.. అతని గురించి తలచుకుంటే ఏడుపొస్తుంది: కంగన
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ, తన భార్య అలియా మధ్య నడుస్తున్న వివాదంపై నటి కంగన రియాక్ట్ అయింది.
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ, తన భార్య అలియా మధ్య నడుస్తున్న వివాదంపై నటి కంగన రియాక్ట్ అయింది. నవాజ్ పరిస్థితి చూస్తే ఆందోళనగా ఉందంటూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీని షేర్ చేసింది. 'ఇదంతా చూస్తుంటే చాలా బాధగా ఉంది. అతన్ని దారుణంగా అవమానిస్తున్నారు. నవాజ్ సర్ని తన ఇంటికి రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. తన కుటుంబం కోసం సర్వస్వం ధారపోశాడు. సంపాదించినదంతా ఆయన సోదరులకి, విడాకులు తీసుకున్న (మాజీ) భార్యకు ఇచ్చాడు.
కొన్నాళ్లుగా అద్దె ఇంట్లో ఉన్నాడు. గతేడాది తను కొనుక్కున్న బంగ్లాను ఆయన మాజీ భార్య వచ్చి ఆ ఇల్లు తనదంటూ క్లెయిమ్ చేయడానికి వచ్చింది. దీంతో ఆమె కోసం ముంబైలో ఫ్లాట్, అతడి తల్లి కోసం ఒక బంగ్లా కొన్నాడు. దాని కోసం నా దగ్గర చాలా హౌస్ డిజైనింగ్ చిట్కాలు తీసుకున్నాడు. ఆ ఇంట్లో మేము పార్టీ కూడా చేసుకున్నాం. అయితే హఠాత్తుగా వచ్చి ఈ బంగ్లాను కూడా స్వాధీనం చేసుకున్న ఆమె అతన్ని ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు. ఆయన రోడ్డుపై నిలబడి ఉండటం నేను చూశాను. అది ఎంత దుర్మార్గం. అది తలుచుకుంటే నాకు ఏడుపు వస్తోంది. ఇంటిని ఆక్రమించాలని ఆమెకు ఎలా అనిపించిందో' అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.