మహిళా రిజర్వేషన్ బిల్లుపై కంగన ఇంట్రెస్టింగ్ పోస్ట్.. సమయం ఆసన్నమైందంటూ

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై నటి కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేసింది.

Update: 2023-09-19 08:37 GMT

దిశ, సినిమా: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై నటి కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అతివల కలలను నిజం చేసేందుకు భారత్ కొత్త యుగానికి నాంది పలికిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ‘మనమందరం ఒక కొత్త యుగం ప్రారంభాన్ని చూస్తున్నాం. మన సమయం వచ్చేసింది. ఇది ఆడపిల్లల కాలం. ఇక భ్రూణహత్యలు వద్దు. ఇది యువతుల కాలం.

భద్రత కోసం ఇకపై పురుషులపై ఆధారపడకూడదు. ఇది మధ్య వయస్కులైన మహిళల సమయం. మీరు అవాంఛితులు కాదు. ఇకపై విలువ తగ్గించుకోవద్దు. ఇది వృద్ధ మహిళల సమయం. ప్రపంచానికి మీ జ్ఞానం, అనుభవం కూడా అవసరం. మన సమయం ఆసన్నమైంది. కొత్త ప్రపంచానికి స్వాగతం. మన కలల భారతానికి స్వాగతం’ #WomenReservationBill’ అంటూ తనదైన స్టైల్‌లో భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Tags:    

Similar News