ఎలన్ మస్క్ ట్వీట్‌పై స్పందించిన కంగన.. జైలుకి పంపడానికేనంటూ

ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ ట్వీట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది.

Update: 2023-03-20 12:53 GMT

దిశ, సినిమా : ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ ట్వీట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది. ఈ మేరకు ప్రేమ వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసిన మస్క్.. లవ్‌లో తనకు ఎదురైన ఇబ్బందులను వెల్లడించాడు. ‘ప్రభుత్వాన్ని కూల్చకుండా అడ్డుకునేందుకు సీఏఐ పంపిన నకిలీ వ్యక్తి అని తెలిసినా.. వారితో ప్రేమలో పడటం భిన్నమైన అనుభూతి’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

అయితే తాజాగా దీనిపై రియాక్ట్ అయిన కంగన తన అనుభవాలను షేర్ చేసుకుంటూ.. ‘నాకంటే నాటకీయమైన లైఫ్ ఎవరికీ ఉండదు. ఓ ప్రేమ వ్యవహారంలో మొత్తం సినిమా మాఫియా నన్ను జైలుకు పంపించడానికి ప్రయత్నించింది. అయితే దానికంటే మస్క్ పెట్టిన ట్వీట్ మరింత ఆసక్తికరంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతుండగా.. హృతిక్‌తో ఆమె లవ్ స్టోరి గురించి నెటిజన్లు చర్చిస్తున్నారు.

Tags:    

Similar News