ఆ యాసిడ్ దాడి నా కుటుంబాన్ని మానసికంగా దెబ్బతీసింది: Kangana Ranaut

ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల యువతిపై ఇటీవల జరిగిన యాసిడ్‌ దాడి దిగ్భ్రాంతికి గురి చేసింది.

Update: 2022-12-15 06:54 GMT

దిశ, సినిమా : ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల యువతిపై ఇటీవల జరిగిన యాసిడ్‌ దాడి దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన కంగనా రనౌత్.. తన సోదరి రంగోలి చందేల్‌పై జరిగిన యాసిడ్‌ దాడిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనైంది.

ఎన్ని చట్టాలు చేసినా అఘాయిత్యాలు ఆగడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 'రోడ్డు పక్కన రోమియో చేతిలో యాసిడ్ దాడికి గురైన రంగోలి చందేల్.. సాధారణ స్థితికి రావడానికి 53 శస్త్రచికిత్సలు చేసుకోవాల్సి వచ్చింది. ఈ శారీరక, మానసిక గాయం ఊహించలేనిది. యాసిడ్ దాడి ఘటన నా కుటుంబాన్ని ఎంతో భయపెట్టింది. ఎవరైనా బైకర్ లేదా అపరిచితుడు దగ్గరకు వస్తే యాసిడ్ పోస్తారేమోనని వెంటనే ముఖాన్ని కప్పుకునేదాన్ని. ఇప్పటికీ కొన్నిసార్లు ఆ ఫియర్ నన్ను వెంటాడుతోంది. ఇలాంటి సంఘటనలు బాధితురాలికి మాత్రమే కాకుండా, ఆమె కుటుంబానికి మానసిక వేదనను మిగుల్చుతాయి' అంటూ చెప్పుకొచ్చింది.

Full View

Also Read...

షాక్‌లో సినీ ఇండస్ట్రీ.. ఆ కేసులో నటికి రెండేళ్ల జైలు శిక్ష 

Tags:    

Similar News