కంగన పెద్ద ఫ్రాడ్.. అంటూ లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన బీజేపీ నాయకుడు
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.
దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. కాగా సరికొత్తగా మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘తేజస్’ అక్టోబర్ 30న రిలీజ్ కానున్న టైమ్‌లోనే.. ఇందుకు సంబంధించిన వివాదంలో చిక్కుకుంది. బీజేపీ నాయకుడు మయాంక్ మధుర్ ఆమె ఫ్రాడ్ అంటూ లీగల్ యాక్షన్‌కు సిద్ధమయ్యాడు. నిజానికి పొలిటికల్ లీడర్స్ రాజ్‌నాథ్ సింగ్, శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ లాంటి వారితో టచ్‌లో ఉండేందుకు తానే హెల్ప్ చేశానని.. దీనికి బదులుగా ‘తేజస్’లో క్యారెక్టర్ ఆఫర్ చేసిందని చెప్పుకొచ్చాడు. ఆ ఊసే లేకపోగా తన సర్వీస్‌కు గాను కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, మోసం చేసిందని వాపోయాడు.
Read More: విడాకులు తీసుకున్న నటి.. స్టేట్మెంట్ ఇవ్వాలని లేదంటూ రియాక్షన్..