ఫిల్మ్ ఫేర్‌పై దావా వేయనున్న కంగన.. ఎందుకంటే?
దిశ, సినిమా: బీ టౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది.
దిశ, సినిమా: బీ టౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఫిల్మ్ ఫేర్ అవార్డులపై దావా వేయబోతున్నట్లు సంచలన కామెంట్స్ చేసింది. విషయానికొస్తే తను నటించిన 'తలైవా' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఎంపికైనట్లు సమాచారం ఇచ్చిన ఫిల్మ్‌ఫేర్ నిర్వాహకులు.. అవార్డు అందుకోవాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన నటి.. తనదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతూ నెట్టింట నోట్ షేర్ చేసింది. 'నేను 2014 నుంచి ఫిల్మ్ ఫేర్ వంటి అనైతిక, అవినీతి, అన్యాయం, పక్షపాత ధోరణితో అందించే అవార్డులను నిషేధించాను. అయినా ఈ సంవత్సరం అవార్డు ఫంక్షన్‌కు హాజరు కావాలని నాకు కాల్స్ రావడం షాక్‌కు గురిచేసింది. ఇలాంటి దుర్మార్గపు పద్ధతులను ప్రోత్సహించడం వల్ల నా గౌరవం, విలువలు దిగజారిపోతాయి. అందుకే ఫిల్మ్ ఫేర్‌పై దావా వేయాలని నిర్ణయించుకున్నా. ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చింది.