ఇలాంటి సినిమా తీసినందుకు సిగ్గుపడాలి: స్టార్ డైరెక్టర్‌పై కంగనా ఫైర్
కాంట్రావర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కంగానా తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంట్రావర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కంగానా తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ సినిమాను విమర్శిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్టులు పెట్టారు. ‘‘ప్రేక్షకులను ఇక మోసం చెయ్యలేరు. ఇలాంటి ఫేక్ సెట్స్, ఫేక్ కాస్ట్యూమ్స్‌తో తీసిన సినిమాలను వాళ్లు అంగీకరించరు. రియల్ లైఫ్‌లో ఇలాంటి దుస్తులు ఎవరైనా ధరిస్తారా? 90ల్లో నేను తెరకెక్కించిన చిత్రాలనే కాపీ కొట్టినందుకు కరణ్ సిగ్గుపడాలి. పైగా 3 గంటల డైలీ సీరియల్‌కు రూ.250 కోట్లు ఖర్చుపెట్టాడు. టాలెంట్ ఉన్నవాళ్లకు బడ్జెడ్ దొరకక ఇబ్బంది పడుతుంటే ఈయనకు ఇంత డబ్బు ఎవరు ఇచ్చారు.
ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనీ వెస్ట్ చేయడం మంచిది కాదు. ఇకనైనా డైరెక్షన్ చేయడం ఆపేయ్. నువ్వు రిటైర్ అయిపో. టాలెంట్ ఉన్న కొత్త నిర్మాతలకు ఛాన్స్ ఇవ్వు.’’ అంటూ కంగనా మండిపడ్డారు. అలాగే ‘రణ్‌వీర్ నీకు నేనిచ్చే సలహా ఒక్కటే డ్రెస్సింగ్ విషయంలో దయచేసి కరణ్‌ను ఫాలో అవ్వద్దు. సాధారణ వ్యక్తుల మాదిరిగా డ్రెస్సింగ్ చేసుకోవడానికి ట్రై చేయ్. సౌత్ హీరోల డ్రెస్సింగ్ ఎంత హుందాగా ఉంటుందో చూసి నేర్చుకో. వారు ఎప్పటికీ మన దేశ సంస్కృతిని నాశనం చెయ్యరు.’’ అంటూ కంగనా ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇక రణ్‌వీర్ సింగ్, అలియా భట్ నటించిన ఈ చిత్రం జులై 28న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.