Kangana Ranaut: నాపై ట్రోలింగ్ చేయండి.. కానీ చెత్త యాసలో ఆ భాష మాట్లాడొద్దు

భారత దేశంలో హిందీ మాట్లాడే పిల్లల యాస గురించి కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది

Update: 2023-04-04 06:33 GMT

దిశ, సినిమా : భారత దేశంలో హిందీ మాట్లాడే పిల్లల యాస గురించి కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కొంతమంది సరైన భాష తెలియకుండా మాట్లాడటం తనకు చిరాకుగా ఉందని చెప్పింది. విషయానికొస్తే.. ఇటీవల ఓ నెటిజన్ ట్విట్టర్‌ వేదికగా నేటితరం మాట్లాడుతున్న భాషపై తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘నన్ను ద్వేషించండి పర్వాలేదు. కానీ, గురుగ్రామ్‌లోని చాలా మంది పిల్లలు కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడతారు. హిందీని మాత్రం పూర్తిగా అర్థం చేసుకోలేరు. నిజం చెప్పాలంటే.. వారు హిందీ మాట్లాడటం మర్చిపోయారు’ అని రాసుకొచ్చాడు. కాగా దీనిపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన కంగన.. ‘నేను ట్రోలింగ్‌ని ఆహ్వానిస్తున్నా. నాపై మాటల దాడి చేయండి పర్వాలేదు. కానీ ఇంగ్లీష్ మాట్లాడే మన దేశ పిల్లలు చెత్త యాసలో హిందీ మాట్లాడుతూ చిరాకు కలిగిస్తున్నారు. అయితే ప్రామాణికమైన దేశీయ యాసలో హిందీ లేదా సంస్కృతం అనర్గళంగా మాట్లాడే పిల్లలు ఎప్పుడూ టాప్‌లో ఉంటారు’ అంటూ రాసుకొచ్చింది. 

Read more:         సల్మాన్ ఖాన్‌తో కలిసి రెచ్చిపోయిన రామ్ చరణ్, వెంకటేశ్ (వీడియో)

Renu Desai: ‘అందరూ ఏడిపించి పోతారు’.. రేణు దేశాయ్ సంచల వ్యాఖ్యలు.

Tags:    

Similar News