ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కమల్ హాసన్.. చనిపోతేనే అది దక్కుతుందని..
విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్యపై తమిళ్ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది.
దిశ, సినిమా : విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్యపై తమిళ్ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది. ఇంత చిన్న ఏజ్‌లో అంత స్ట్రెస్ ఫీల్ కాకూడదని పిల్లలకు సూచించింది. ఈ క్రమంలోనే కాలేజ్ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయిన లోకనాయకుడు కమల్ హాసన్.. 20ఏళ్ల వయసులో తన ఆలోచనా విధానం ఎంత మూర్ఖంగా ఉండేదో చెప్పుకొచ్చాడు. ‘చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తున్న నన్ను ఎవరు గుర్తించట్లేదని బాధపడ్డాను. నేను చనిపోతేనే ఈ ఇండస్ట్రీకి తన గొప్పతనం గురించి తెలుస్తుందని అనుకున్నా. ఈ విషయాన్నే నా మెంటర్‌తో పంచుకున్నా. దీంతో ఆయన.. నువ్వు జీనియస్ అయితే మరి నేనేంటి అని ప్రశ్నించాడు. పట్టుదలతో పని చేస్తూ.. కోరుకునే గొప్ప క్షణాల కోసం వెయిట్ చేయాలని సూచించాడు’ అని చెప్పుకొచ్చాడు. ‘నేను మరణాన్ని జీవితంలో ఒక పార్ట్‌గా భావించా. లైఫ్, డెత్ వేర్వేరు కాదు. ఎండ్‌లెస్ లైఫ్‌కు పర్పస్, మీనింగ్ రెండూ లేవు. మరణం కచ్చితంగా వస్తుంది. దానికోసం పరుగెత్తాల్సిన అవసరం లేదు’ అని విద్యార్థులకు వివరించాడు.