‘కన్న తండ్రి, కట్టుకున్న భర్త ఇద్దరూ మోసం చేశారు’.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల అందరి జీవితం ఒకేలా ఉంటుందనుకోవడం నిజంగా పొరపాటే.
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల అందరి జీవితం ఒకేలా ఉంటుందనుకోవడం నిజంగా పొరపాటే. పైకి కనిపించినంత ఆనందంగా, రిచ్‌గా ఉండరు. ఒకనొక సమయంలో తాము కూడా తిండి తినలేని పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంటుందంటూ పలువురు నటీనటులు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సారికకు కడా ఇదే సిచ్యూవేషన్ ఎదురైందట. చిన్నప్పుడే తండ్రి వదిలేయడంలో కుటుంబం రోడ్డున పడిందట. దీంతో ఈమె సినిమాల్లో నటిస్తూ కుటుంబాన్ని పోషించిందని టాక్.
1981 లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సారిక స్టార్ హీరో కమల్ హాసన్ తో ప్రేమలో పడింది. శృతిహాసన్, అక్షర హాసన్‌కు జన్మనిచ్చారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ కమల్ హాసన్‌తో విడాకులు అయ్యాయి. దీంతో సారిక పరిస్థితి దారుణంగా మారింది. తల్లిని, సారికను చిన్నప్పుడే తండ్రి వదిలేడయం.. ఇటు కట్టుకున్న భర్తతో విడాకులు అవ్వడంతో ఈ నటి జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందట. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ గతంలో సారిక చేసిన కామెంట్స్ అభిమానులు గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నారు.