వితంతువులకు మద్దతు అందిస్తున్న యంగ్ హీరోయిన్.. నెట్టింట ప్రశంసల వర్షం

బ్యూటిఫుల్ కళ్యాణీ ప్రియదర్శన్ వరుస విజయాలతో దూసుకుపోతుంది.

Update: 2023-12-27 10:05 GMT

దిశ, సినిమా : బ్యూటిఫుల్ కళ్యాణీ ప్రియదర్శన్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా వితంతువుల కోసం ఆమె తీసుకున్న చొరవపై ప్రశంసలు కురుస్తున్నాయి. కేరళ ప్రభుత్వం ‘Ammakkilikoodu’ పేరుతో విడోస్‌కు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఎమ్మెల్యే అన్వర్ సాదత్ అండ్ టీమ్ ఈ ప్రాజెక్ట్‌ అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటుండగా.. ఇందులో భాగంగా 50వ ఇంటిని నిర్మించారు. సఫియాత అనే వితంతువుకు పంపిణీ చేసేందుకు కళ్యాణిని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమోషనల్ అయిన యంగ్ హీరోయిన్.. ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఎంత అవసరమో సఫియాత ఆనందాన్ని చూస్తే అర్థం అవుతుందని తెలిపింది. మహిళలకు రక్షణ అందిస్తున్న ‘Ammakkilikoodu’ అర్హులందరికీ అందాలని కోరుకుంటున్నానని.. ఈ బిగ్ థింగ్‌లో స్మాల్ పార్ట్‌ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోస్‌ను నెట్టింట షేర్ చేసింది.


Similar News