హోలీ రోజు శ్రీజకు షాక్ ఇచ్చిన కల్యాణ్ దేవ్!
చిరంజీవి కూతురు శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ జంట గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.
దిశ, సినిమా: చిరంజీవి కూతురు శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ జంట గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇక ఈ జంట త్వరలో విడాకులు తీసుకుని విడిపోబోతున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, ఈ జంట మాత్రం ఈ విషయంపై రియాక్ట్ ఇవ్వలేదు. అయినప్పటికి ప్రస్తుతం భార్య శ్రీజకు దూరంగా ఉంటున్నారు కల్యాణ్ దేవ్. అయితే తాజాగా దేవ్ నిన్న హోలీ సందర్భంగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎప్పుడు తన కూతురిని తలుచుకుంటు ఎమోషనల్ పోస్ట్లు పెట్టే కల్యాణ్ నిన్న హోలీ పండుగ సందర్భంగా అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు తన ఫొటోలు కూడా షేర్ చేశారు. ఈ పిక్స్లోచాలా సంతోషంగా కనిపించారు. దీంతో తన విడాకుల విషయం నుంచి బయటపడ్డాడంటున్నారు ఫ్యాన్స్.