‘కల్కి’ వీకెండ్ కలెక్షన్స్ అదిరిపోయాయి.. మొత్తం ఎన్ని కోట్లంటే?(పోస్ట్)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ అన్ని అందరినీ ఆకట్టుకున్నాయి. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ ఎపిక్ వండర్ లో సాలిడ్ కాన్సెప్ట్ తో పాటుగా ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టుగా భారీ తారాగణం కూడా కనిపిస్తుంది. ఇండస్ట్రీలోని సెలెబ్రీటీస్‌లు సైతం ఈ మూవీపై రివ్యూలు ఇస్తుంటే ప్రేక్షకుల్లో ఈ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది.
కల్కి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. రెండు రోజుల్లో 298 కోట్లు వసూలు చేయగా మూడు రోజుల్లో 415 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక నాలుగు రోజుల్లో కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 555 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని బరిలో దిగిన కల్కి సినిమా నాలుగు రోజుల్లోనే సగం కలెక్షన్స్ సాధించింది. మరో వారం రోజుల పాటు తెలుగులో ఏ సినిమా లేకపోవడం, బాలీవుడ్‌లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో కల్కికి ఈ వారం కూడా కలిసొస్తుంది. ఇక వారం రోజుల్లో ఈజీగా 1000 కోట్లు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.