Kalki: ఓటీటీలో ‘కల్కి’ రన్ టైమ్ తగ్గించిన టీమ్.. ఏ సీన్స్ కట్ చేశారంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ చిత్రం కొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2024-08-22 15:33 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ చిత్రం కొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. మైథాలజికల్, సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సూనామీ సృష్టిస్తున్న ‘కల్కి’ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ కూడా సొంతం చేసుకోగా.. ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. అయితే.. థియేటర్‌తో పోల్చితే ఓటీటీ రిలీజ్‌లో ‘కల్కి’ రన్‌టైమ్ తగ్గినట్లు తెలుస్తుంది. ఈ మేరకు థియేటర్లలో 181 నిమిషాలు అంటే 3 గంటల 1 నిమిషం ఉన్న నిడివిని ఓటీటీలోకి వచ్చేసరికి 175 నిమిషాలకే కుదించారు.

Tags:    

Similar News