Kalki 2898AD: మరో ఘనత.. ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డును బద్దలు కొట్టిన ‘కల్కి 2898ఏడీ’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటించిన మరో సన్సేషనల్‌ చిత్రం 'కల్కి 2898ఏడీ'.

Update: 2024-07-22 14:27 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటించిన మరో సన్సేషనల్‌ చిత్రం 'కల్కి 2898ఏడీ'. మైథాలాజికల్‌, సైన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. జూన్ 27న రిలీజైనా ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై ప్రియాంక దత్‌, స్వప్నదత్‌ ఈ సినిమా నిర్మించారు. లెజండరీ నటులు అమితాబచ్చన్‌, కమల్‌హాసన్‌ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించి ‘కల్కి’ విజయంలో ముఖ్యభూమిక పోషించారు. సినిమా విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ ఇప్పటివరకు ఎన్నో రికార్డులు నెలకొల్పింది.

ముఖ్యంగా ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘కల్కి’ హిందీ వెర్షన్‌ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కలిసి నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డులను బ్రేక్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర ఫుల్‌ రన్‌లో హిందీ వెర్షన్‌లో రూ. 274 కోట్లు సాధించింది. కల్కి ప్రస్తుతం విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు బాలీవుడ్‌లో రూ. 277 కోట్ల 40 లక్షలు వసూలు చేసి ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను దాటింది. అయితే ఇంకా కల్కి మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉందని తెలుస్తుంది.

టాప్​ 10 హిందీ డబ్బింగ్​ మూవీస్​ కలెక్షన్స్​

1. బాహుబలి 2 రూ. 511 కోట్లు

2. కేజీఎఫ్2 రూ. 434 కోట్లు

3. కల్కి రూ. 277 కోట్లు ( కౌంటింగ్​ )

4. ఆర్ఆర్ఆర్ రూ.​ 274 కోట్లు

5. 2పాయింట్​ ఓ రూ. 189 కోట్లు

6. సలార్ రూ.​ 153 కోట్లు

7. సాహో రూ. 143 కోట్లు

8. బాహుబలి రూ. 118 కోట్లు

9. పుష్ప రూ. 108 కోట్లు

10. కాంతార రూ. 79 కోట్లు


Read more...

Game Changer: గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్ పై దిల్‌రాజు కీలక అప్డేట్ 

Tags:    

Similar News