Kalki 2898 AD: ‘ప్లీజ్.. దయచేసి అలాంటివి చేయకండి’.. ఆడియెన్స్‌కు ‘కల్కి’ నిర్మాతల రిక్వెస్ట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నది.

Update: 2024-06-27 13:32 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నది. దేశంలోని పలు భాషల నుంచి దిగ్గజ నటులను కీలక పాత్రల్లో చూపించి దర్శకుడు నాగ్ అశ్విన్ సూపర్ సక్సెస్ అయ్యారు. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతంగా తెరకెక్కించారు. దాదాపు రూ.700 కోట్లతో ఈ చిత్రాన్ని దిగ్గజ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన అభిమానులంతా తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఫ్యాన్సే కాకుండా సెలబ్రెటీలు సైతం మంచి రివ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు కల్కి నిర్మాతలు కీలక రిక్వెస్టులు చేస్తున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

‘కల్కిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నాలుగేళ్లు కష్టపడ్డాం. హాలీవుడ్‌ను తలపించేలా వరల్డ్ క్లాస్ క్వాలిటీస్‌లో కల్కి తీయడానికి మా నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడలేదు. చెమట, రక్తం ఓడ్చి ఈ సినిమాను తీసుకొచ్చాం. దయచేసి థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు మొబైల్ ఫోన్లలో, కెమెరాలలో సన్నివేశాలను చిత్రీకరించకండి. లీక్‌ చేసి పైరసీలకు అవకాశం ఇవ్వోద్దు.’ అని వైజయంతీ మూవీస్‌ బ్యానర్ నిర్మాతలు ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా, దీపికా పడుకొని హీరోయిన్‌గా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, కోలీవుడ్ మెగాస్టార్ కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు.

Tags:    

Similar News