చివరి కోరిక తీరకముందే కన్నుమూసిన కళాతపస్వి..!
తెలుగు దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ గురువారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: తెలుగు దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ గురువారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందులూ తుదిశ్వాస విడిచారు. అయితే 1965 లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన సినిమా 'ఆత్మగౌరవం' సినిమాతో కె. విశ్వనాథ్ దర్శకుడిగా తన సినీ ప్రయానాన్ని మొదలు పెట్టి శంకరాభరణం, ప్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శృతిలయలు, సాగర సంగమం వంటి ఎన్నో అద్భుత చిత్రాలను కళాతపస్వి అందించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా చాలా చిత్రల్లో నటించారు. అయితే ఆయన చివరి కోరిక తీరకుండానే మరణించారట. తన సినీ కెరియర్‌లో ఎక్కువగా సాంఘీక సినిమాలే చేశారు. పౌరాణికంపై అవగాహన లేకపోవడం వల్ల అలాంటి సినిమాలు చెయలేదట. అన్నమయ్య సినిమా చెయాలని ఎన్నో కలలు కన్నారట. కానీ, అదే కథను మరో దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని తెలిసి తన ప్రయత్నాన్ని మానుకున్నారని సమాచారం. అలా తన కల నెరవేరకపోవడం కళాతపస్వికి తీరని కలలాగే మిగిలిపోయిందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
1.Big News: ఆరు నెలల్లో వైజాగ్‌కు సినీ ఇండస్ట్రీ.. 100 ఎకరాల కేటాయింపు!