సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన కాజోల్.. చాలా కఠిన పరిస్థితుల్లో ఉందట

బాలీవుడ్ నటి కాజోల్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది.

Update: 2023-06-09 11:19 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కాజోల్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. నెట్టింట ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను అలరించే నటి.. సోషల్ మీడియానుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఇంతకాలం ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటో, వీడియోలన్నీ డిలిట్ చేయడం విశేషం. ‘ప్రస్తుతం నా లైఫ్‌లో అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా. కాబట్టి.. టేకింగ్ ఏ బ్రేక్ ఫ్రమ్ సోషల్ మీడియా’ అంటూ నెట్టింట ఓ నోట్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా.. అసలు కారణం చెప్పకుండా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని కొంమంది ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ‘ఇదంతా ఓ పెద్ద స్టంట్. ప్రమోషన్స్ కోసమే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారు’ అంటూ నెగెటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.

Read More...   Nithya Menen :ఫైనల్లీ పెళ్లి పీటలు ఎక్కిన నిత్యామీనన్.. వరుడు ఎవరంటే..! 

Varun Tej-Lavanya Tripathi: ఎంగేజ్‌మేంట్ అతిథుల లిస్ట్ ఇదే..



Similar News