స్త్రీల అందాన్ని కామం, సెక్స్‌తోనే ముడిపెడతారా.. నెటిజన్లపై కాజోల్ సీరియస్
మహిళల అందంపై మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది నటి కాజోల్. ఆమె నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’ జూన్ 29న రిలీజ్ కానుంది.
దిశ, సినిమా: మహిళల అందంపై మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది నటి కాజోల్. ఆమె నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’ జూన్ 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న ఆమె.. రీసెంట్ ఇంటర్వ్యూలో తాను పోషించిన పాత్ర, బోల్డ్ సన్నీవేశాలపై ఓపెన్‌గా మాట్లాడింది. ‘ఒకానొక సమయంలో స్త్రీ అందం, దానికుండే ప్రత్యేకతలపై సమాజం చాలా ఓపెన్‌గా ఉండేది. మనం తినడం, తాగడం, బట్టలేసుకోవడం, పడుకోవడం చివరికి ప్రతిరోజు టాయిలెట్ వెళ్లినంత సాధారణంన విషయంగానే చూసేవారు. స్త్రీ అందం అంటే ఒకరకమైన ఆనందమే తప్పా మరొకటి కాదు. కానీ, కాలక్రమంలో అది పూర్తిగా మారిపోయింది. అందం అంటే కామం, సెక్స్ అనే అర్థంలోకి మారిపోయింది. అయితే గ్లామర్‌ను ఒకప్పటి లాగే జీవితంలో చాలా సాధారణ భాగంగానే చూడాలని నేను భావిస్తున్నా’ అంటూ నెట్టింట ఈ సినిమాపై వస్తున్న ట్రోలింగ్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడింది.