ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్న కాజల్.. అలా హింసించారంటూ కామెంట్స్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజల పాటు టాలీవుడ్లో వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగమ్మ, తర్వాత గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకొని
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజల పాటు టాలీవుడ్లో వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగమ్మ, తర్వాత గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకొని, తర్వాత పండంటి పిడ్డకు జన్మనిచ్చిన కొన్ని రోజులకే మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో ఇచ్చిన కాజల్ కన్నీరు పెట్టుకుంది. తన ప్రెగ్నెంట్ సమయంలోని కొన్ని చేధు అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ..నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు పోస్ట్ చేసిన ఫొటోలను చూసి లావుగా ఉన్నావంటూ కొందరు మాటలతో బాగా హింసించారు. బాడీ షేమింగ్ కామెంట్స్ తో మొదట్లో ఎంతో బాధపడ్డాను.కానీ, ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశారు. ఇక ఒక వైపు నటిగా, మరో వైపు తల్లిగా కొనసాగటం అనేది చాలా కష్టమైన పని. నా కొడుకు చాలా చిన్నవాడు. వాటిని వదిలేసి వర్క్‌కి వెళుతుంటే గుండె బద్దలవుతుంటుంది. కానీ నేను చేసే పనిని ప్రేమిస్తున్నాను, కాబట్టి తప్పదు అంటూ చెప్పుకొచ్చింది.