అమ్మాయిపై దాడి రాక్షసత్వమే: బాధకలిగిస్తోందన్న Kajal Aggarwal

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'అమ్మాయిపై దాడి' వీడియోపై నటి కాజల్ అగర్వాల్ రియాక్ట్ అయింది..

Update: 2023-02-05 10:25 GMT

దిశ, సినిమా: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'అమ్మాయిపై దాడి' వీడియోపై నటి కాజల్ అగర్వాల్ రియాక్ట్ అయింది. కొంతమంది యువకులు ఒక మహిళను అత్యంత దారుణంగా కొట్టడం చూసి చలించిపోయానంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తరేక్ ఫతాహ్ అనే పాకిస్థానీ జర్నలిస్ట్ చేసిన 'భారతీయులు తమ దేశాన్ని, నాగరికతను అవమానిస్తున్నారు' అనే ట్వీట్‌ను రీట్వీట్ చేసిన కాజల్.. 'ఏంటీ దారుణం. ఈ రాక్షసులకు తగిన గుణపాఠం చెప్పాలి. ఇలాంటి రాక్షసత్వానికి కారణం ఏదైనా అది సరైంది కాదు. మనం ప్రతిసారీ మానవత్వాన్ని మరిచిపోవడం చూసి బాధకలుగుతోంది' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలావుంటే.. ఈ ఘటన 2021లో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. 

Tags:    

Similar News