వింటర్ వెకేషన్ కోసం.. స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్
దిశ, సినిమా: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ స్టార్ హీరోయిన్ కాజల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. చరణ్ సరసన ‘మగధీర’ సినిమాతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న కాజల్.. ‘చందమామ’ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరై ‘ఆర్య 2’ తో ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది. అలా ఎంట్రి ఇచ్చిన అనతి కాలంలోనే మంచి ఫేమ్ సంపాదించుకుని దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఇక కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్న టైం లోనే 2020లో గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్.. పండంటి మగ బిడ్డకి కూడా జన్మనిచ్చింది. అప్పటి నుండి కాజల్ తన ప్రతి మూమెంట్‌ని కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తుంది.ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్ లు ఉన్న సరే.. ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ చిన్నది ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెలింది. అక్కడి విశేషాలను తనకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా ద్యారా ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది. ప్రజంట్ ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.