'కబ్జ'.. మార్చి 17న తెలుగులో విడుదలవుతున్న ఉపేంద్ర మూవీ!
ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించిన ప్రెస్టీజియస్ మూవీ 'కబ్జ'.
దిశ, సినిమా: ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించిన ప్రెస్టీజియస్ మూవీ 'కబ్జ'. కన్నడలో ఎన్. సుధాకర్ రెడ్డి సమర్పణలో ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ పతాకాలపై మార్చి 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..
'పలు కన్నడ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతే ఎగ్జయిట్‌మెంట్‌ని క్రియేట్ చేసిన మరో కన్నడ చిత్రం 'కబ్జ'. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర ఈ చిత్రంలో హీరోగా నటించటం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఆర్.చంద్రుగారు ఒక్కో ఫ్రేమ్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. తప్పకుండా ఇది పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది' అన్నారు.
ఇవి కూడా చదవండి: