రూ.100 కోట్ల క్లబ్‌లోకి జ్యోతిక హారర్ మూవీ.. ‘సైతాన్’

బాలీవుడ్ నుండి తాజాగా విడుదలైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘సైతాన్’.

Update: 2024-03-18 03:48 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ నుండి తాజాగా విడుదలైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘సైతాన్’. వికాస్ బహల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక నటించారు. విడుదలైన తొలి షో నుండి మంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీలో ఇక అతీంద్రియ శక్తులు ఉన్న వ్యక్తిగా మాధవన్ నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సైతాన్ మూవీ 2023లో గుజరాతీలో వచ్చిన ‘వశ్’ సినిమాకు రీమేక్.

ఇక వసుల పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా సెకండ్ వీకెండ్ ముగిసే సమయానికి ఇండియాలో రూ.100 కోట్ల మార్క్ దాటినట్లు బాక్సాఫీస్ ట్రెండ్స్‌ను ట్రాక్ చేసే Sacnilk.com వెల్లడించింది. రెండో ఆదివారం కూడా ఈ మూవీ అంతే హౌస్ ఫుల్ కావడం విశేషం.నిజానికి ఫస్ట్ వీకెండ్ కంటే సెకండ్ వీకెండ్ కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. కాగా 9వ రోజు వరకు రూ.93.57 కోట్లు వసూలు చేసిన ‘సైతాన్’.. పదో రోజు రూ.100 కోట్ల మార్క్ అందుకుంది. ప్రస్తుతం పది రోజుల్లో రూ.103.05 కోట్లు వసూలు చేసింది. ఆదివారం నార్త్ బెల్ట్ లో 37.19 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. కేవలం 10 రోజుల్లో రూ.103.05 కోట్లు వసూలు అంటే మామూలు విషయం కాదు.

Read More..

OTT update: ఈ వారం ఓటీటీలో ఏరంగా 20 సినిమాలు విడుదల.. అందులో ఈ నాలుగు స్పెషల్  


Similar News