భార్యముందే ఆ హీరోయిన్‌తో జూనియర్ ఎన్టీఆర్ రొమాన్స్.. ట్విస్ట్ ఏంటంటే..
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా భార్య పక్కన ఉండగానే మరొక హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలంటే ఇబ్బందిపడతారు. కానీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందుకు భిన్నం.
దిశ, సినిమా : ఎంత పెద్ద స్టార్ హీరో అయినా భార్య పక్కన ఉండగానే మరొక హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలంటే ఇబ్బందిపడతారు. కానీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందుకు భిన్నం. వైఫ్ ఉండగానే మరొక బ్యూటీతో ముద్దులు, హద్దులు దాటడానికి రెడీ అయిపోయాడు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దేవర సినిమాకు తారక్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీ ఉన్నాడు.
‘దేవర’లో ఎన్టీఆర్ హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఈ మూవీతోనే ఆమె ఫస్ట్ టైమ్ సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. కాగా మూవీ థర్డ్ షెడ్యూల్ అంతా థాయ్ లాండ్లో జరుగుతోంది. అయితే జాన్వీ కపూర్, ఎన్టీఆర్‌తో ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఇక్కడే ప్లాన్ చేశారట మేకర్స్. ట్విస్ట్ ఏంటంటే.. తారక్ షూటింగ్లో పాల్గొనేందుకు థాయ్ లాండ్కు ఫ్యామిలీతో సహా వెళ్లాడట. అయితే షూటింగ్లో భాగంగా జాన్వీతో రొమాంటికల్ సాంగ్ చేసే సందర్భంలో కూడా తారక్ భార్య లక్ష్మీ ప్రణతి, అతనితోపాటే అక్కడే ఉండనుంది. అంటే ఎన్టీఆర్ తన భార్య ముందే మరో హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్నాడు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘భార్య ముందే మరో హీరోయిన్‌తో అలా చేస్తున్నావంటే నువ్వు నిజంగా గ్రేట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తారక్ అభిమానులు.