Hardik-Natasa Divorce: నటాషాకు, హార్ధిక్ పాండ్యా ఇచ్చిన భరణంపై షాకింగ్ కామెంట్స్ చేసిన న్యాయనిపుణులు
హార్ధిక్ పాండ్యా తన ఆస్తిలో 70 శాతం ఇచ్చినట్టు మొన్నటి వరకు ఎన్నో వార్తలు నెట్టింట హల్చల్ చేసాయి.
దిశ, సినిమా: హార్ధిక్ పాండ్యా ఈ మధ్యకాలంలో వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. కొంతకాలంగా నడుస్తూ వస్తున్న డివోర్స్ మ్యాటర్ నిజమేనని ఇద్దరూ తేల్చేసారు. గురువారం రాత్రి సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకున్నట్టు పోస్ట్ తో క్లారిటీ ఇచ్చాడు. ఇద్దరూ అంగీకరంతోనే విడిపోతున్నట్టు ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. మా ఇద్దరికి పుట్టిన అగస్త్యను ఎవరికి వారు చూసుకుంటామని తెలిపారు. దీంతో నటాషాకు కోట్లు భరణం ఇచ్చినట్టు టాక్ బాగా నడుస్తుంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో ఇక్కడ తెలుసుకుందాం..
హార్ధిక్ పాండ్యా తన ఆస్తిలో 70 శాతం ఇచ్చినట్టు మొన్నటి వరకు ఎన్నో వార్తలు నెట్టింట హల్చల్ చేసాయి. మొత్తం ఆమెకి ఇస్తే పాండ్యా నష్టాల్లో కురుకుపోతాడు. అయినా మొదటి నుంచి తన సంపాదన అమ్మ పేరిట ఉందని.. ఇలా ఒక రకంగా కాకుండా అనేక వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. తాజాగా, ఇదే విషయంపై న్యాయనిపుణులు షాకింగ్ కామెంట్స్ చేసారు.
ఇద్దరూ ఇష్టంతో విడిపోయేటప్పుడు ఇక భరణం ఎందుకు చెల్లించాలి పాండ్యా , ఆమెకు ఏమి చెల్లించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొస్తున్నారు. ఇది విన్న నెటిజెన్స్ అంతే కదా మనీ వాళ్ళ దగ్గర లేక కాదు.. కలిసి కాపురం చేయడం ఇష్టం లేక విడిపోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.