టీడీపీ శ్రేణులకు శుభవార్త.. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఈ ఏడాదే!

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరో రేంజ్‌కు ఎదిగిపోయాడు

Update: 2023-03-07 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్/డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. రాజకీయాంశాల పట్ల జూనియర్ దూరంగా ఉంటున్న ఆయన్ను మాత్రం పాలిటిక్స్ వదలడం లేదు. నిత్యం ఏదో చోట ఆయన టాపిక్ పొలిటికల్ తెరపైకి వస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెడుతాడా అని ఆయన అభిమానులు సైతం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజా ఓ ప్రముఖ జ్యోతిష్యుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ది పుబ్బ నక్షత్రం, సింహరాశి అని ఈ రాశి వాళ్లు ఎలాంటి పని అయినా సరే చాలా ధైర్యంగా చేస్తారని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ రాశి వ్యక్తులకు ప్రజాభిమానం ఎక్కువ ఉంటుంది. తమ వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారన్నారు. ప్రస్తుతం జాతక రీత్యా జూనియర్ విషయంలో శుక్రుడు పీక్స్ దశలో ఉన్నాడు. ఈ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ ప్రజాపాలనలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో మరోసారి యంగ్ టైగర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ మొదలైంది.

తారక్ పై టీడీపీ వర్సెస్ వైసీపీ

ఇటీవల నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై అధికార వైసీపీ నుంచి అంతే స్థాయిలో రియాక్షన్ వెలువడింది. లోకేష్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి లోకేష్ ఆహ్వానించడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశఆరు. అసలు టీడీపీని స్థాపించింది జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ అని విమర్శల దాడి చేశారు. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కు సర్వహక్కులు ఉన్నాయని గతంలో పార్టీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం కూడా చేశాడని అందువల్ల లోకేష్, చంద్రబాబు తప్పుకుని వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆ పార్టీ కొంతలో కొంతైనా మెరుగుపడుతుందని నిప్పులు చెరిగారు.

నందమూరి తారక మంత్రం ఎవరో

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన తారకరత్న అకాల మరణం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చర్చగా మారింది. తన తాత స్థాపించిన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్న తారకరత్న అర్థాంతరంగా కన్నుమూయడంతో నందమూరి కుటుంబం నుంచి రాజకీయ ప్రవేశం చేయబోయేది ఎవరు అనేది హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నా ఆయన తర్వాత వారసత్వం ఎవరు అనేది చర్చ కొనసాగుతోంది. అభిమానులు, పార్టీలో కీలక నేతలదరూ జూనియర్ ఎన్టీఆర్ వైపు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీని మరింత ధీటుగా ఎదుర్కోవాలంటే సైకిల్ పార్టీని ముందుకు నడిపించే ఓ మంత్రం కావాలి. అది తారక మంత్రం అయితే బాగుంటుందనే చర్చ మెజార్టీ తెలుగు తమ్ముళ్లలో ఉంది. కానీ ప్రస్తుతం జూనియర్ సినీ కేరీర్ పీక్స్ లో ఉంది. ఇలాంటి సమయంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ పై బిగ్ డిసిషన్ ఇంత త్వరగా తీసుకుంటారా అనేది ప్రశ్నే.

Read more:

వై ఓన్లీ 23...ఆత్మవిమర్శకు టీడీపీ జడుపు | వై ఓన్లీ 23...ఆత్మవిమర్శకు టీడీపీ జడుపు.

Tags:    

Similar News