పెళ్లి చేసుకునేందుకు నేను రెడీ.. మ్యారేజ్‌పై జేడీ చక్రవర్తి క్లారిటీ!

జేడీ చక్రవర్తి, యాంకర్ విష్ణుప్రియ మధ్య ఎఫైర్ ఉందని.. వారు ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2023-08-05 09:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: జేడీ చక్రవర్తి, యాంకర్ విష్ణుప్రియ మధ్య ఎఫైర్ ఉందని.. వారు ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ షోలో పాల్గొన్న విష్ణు.. తనకు జేడీ చక్రవర్తి అంటే ఇష్టమని ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుందని తెలిపింది. అప్పటి నుంచి ఈ వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేడీ.. తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.

జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దయా’. ఈ సినిమా నిన్న (శుక్రవారం) డిస్నీ+హార్ట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయింది. అయితే.. చాలా గ్యాప్ తర్వాత వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన జేడీ చక్రవర్తి వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి యాంకర్ ప్రశ్నించగా.. ‘‘నేను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నాను. అయితే నా పెళ్లి మీరే చేయాలి. ఎక్కడ దొరక్కపోతే నా స్టూడియోలో పెళ్లి చేయండి. అమ్మాయి ఎవరనేది మీ ఇష్టం.. నేను మాత్రం మ్యారేజ్‌ చేసుకునేందుకు రెడీగా ఉన్నాను’’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు జేడీ చక్రవర్తి. దీంతో యాంకర్ విష్ణుప్రియకు, జేడీ చక్రవర్తికి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టైంది.

Read More:   చిరంజీవి నా కారు డోర్ తీయడం గిల్టీగా అనిపించింది: సుశాంత్ 

Tags:    

Similar News