ఆ హీరోయిన్ కటౌట్ పెద్దది.. అర్ధరాత్రి థైస్ చూడానికి వెళ్లేవాళ్లం: స్టార్ నటుడి బెస్ట్ ఫ్రెండ్స్ సంచలన కామెంట్స్

విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్నారు నటుడు జేడీ చక్రవర్తి.

Update: 2024-07-31 05:22 GMT

దిశ, సినిమా: విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్నారు నటుడు జేడీ చక్రవర్తి. ‘హరిశ్చంద్ర, కోదండ రాముడు, పాపే నా ప్రాణం, మా పెళ్ళికి రండి, అక్కా బావెక్కడ, నవ్వుతూ బతకాలిరా, సూరి, ప్రేమకు స్వాగతం, గోల్‌మాల్,కాశి, మధ్యాహ్నం హత్య, దుబాయ్ శీను, హోమం, జోష్, మనీ మనీ మోర్ మనీ ’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. హోమం, సిద్ధం, మనీ మనీ మోర్ మనీ, ఆల్ ద బెస్ట్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించగా.. గత ఏడాది వచ్చిన దయా అనే వెబ్ సిరీస్ లో నటించారు. అయితే ఈ హీరోకు అప్పట్లో ఓ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టమట.

దీంతో చక్రవర్తి తన కోసం చిలిపి పనులు చేస్తుండేవారట. జేడీ క్రష్ అయిన ఆ హీరోయిన్ తొడలు చూడానికి అర్ధరాత్రి వాళ్ల వెళ్లేవారని ఓ వెబ్ సిరీస్ వేడుకల్లో జేడీ క్లోజ్ ఫ్రెండ్ ఉత్తేజ్ చెప్పుకొచ్చారు. పంజాగుట్టలో ఆమె కటౌట్ పెద్దిదిగా ఉండేదని, దీంతో అర్ధరాత్రి పంజాగుట్టకు వెళ్లేవారని తెలిపారు. ఉత్తేజ్ ఈ మాటలు చెబుతుంటే జేడీ చక్రవర్తి అవును అవును నిజమే అని ఒప్పుకున్నారు. మరీ ఆ హీరోయిన్ ఎవరో కాదు. అప్పటి యూత్ కలల రాణి రంభ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక జేడీ అండ్ రంభ కలిసి బొంబాయి ప్రియుడు చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News