హనీమూన్లో జరిగిన ఆ సంఘటన వల్ల మతం మార్చుకున్నా.. జయసుధ
అలనాటి జయసుధ అందరికీ సుపరిచితమే. సహజనటి జయసుధ తన అందం, నటనతో ఇండస్ట్రీలో న్యాచురల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
దిశ, సినిమా: అలనాటి జయసుధ అందరికీ సుపరిచితమే. సహజనటి జయసుధ తన అందం, నటనతో ఇండస్ట్రీలో న్యాచురల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈమె తొలితరం అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం సెలెక్టివ్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకొని నటిస్తుంది. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలు, అత్త పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక జయసుధ మొదట్లో బిజినెస్ మాన్ అయినా రాజేంద్ర ప్రసాద్ ని పెళ్లి చేసుకొని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు జితేంద్ర కపూర్ సోదరుడు అయిన నితిన్ కపూర్ ని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మ మొదట హిందువు అయినప్పటికీ ఆ తర్వాత క్రిస్టియన్ మతంలోకి మారిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మతంలోకి మారడానికి ప్రధాన కారణం అదే అంటూ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో జయసుధ చెప్పుకొచ్చింది. దీనిలో భాగంగా నితిన్ కపూర్ తో పెళ్లయ్యాక థాయిలాండ్ కి ఈ జంట హనుమాన్ కి వెళ్లారట. ఇక ఆ సమయంలో అక్కడ నీళ్లలో బోటింగ్ చేద్దామని నితిన్ జయసుధ తో చెప్పారట. కానీ నీళ్లంటే భయం ఉన్న జయసుధ నేను చేయను అని చెప్పిందట. అయితే రెండు రోజులు అయ్యాక మూడో రోజు తన భర్త కోరిక కాదనలేక సముద్రం లో జెట్ స్కీం కి వెళ్ళిందట.
ఇక అలా వెళ్ళిన కొద్దిసేపు బాగానే అనిపించినప్పటికీ ఆ తర్వాత ఆమె నీళ్లలో మునిగి పోయిందట. అయితే ఈత రాని జయసుధ నా జీవితం ఇంతటితో అయిపోయింది చనిపోతున్నాను అని భావించి హిందువు అయినప్పటికీ ఏసుక్రీస్తు దేవున్ని తలుచుకుందట. అలా తలచుకున్న కొద్దిసేపటికే ఆమెకు ఆకాశంలో ఉన్న సూర్యకిరణాల్లో ఏసుక్రీస్తు రూపం కనిపించిందట. ఆ తర్వాత శ్వాస బిగపట్టుకొని నీళ్ల నుండి జయసుధ బయటపడిందట. అలా ఆ సంఘటన జయసుధ ను హిందువు నుండి క్రిస్టియన్ మతంలోకి మారేలా చేసిందని చెప్పుకొచ్చింది.