Janhvi Kapoor: జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందా?

జాన్వి కపూర్ బాలీవుడ్ సినిమాలే చేస్తుందనుకున్నారు.

Update: 2023-03-27 03:15 GMT

దిశ, వెబ్ డెస్క్: జాన్వి కపూర్ బాలీవుడ్ సినిమాలే చేస్తుందనుకున్నారు. రాజమౌళి ,కొరటాల సినిమాలో అమ్మడు ఓకే అవ్వబోతుందని కొందరన్నారు. బోనీకపూర్ ఈ వార్తల్లో నిజం లేదని కొట్టి పారేసాడు. కట్ చేస్తే ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది , జాన్వి కపూర్ మీ సౌత్ ఇండస్ట్రీ స్వాగతించింది. కోలీవుడ్ హీరోలు వారి సినిమాల్లో జాన్వీకి స్పేస్ ఇవ్వటానికి బోనీ కపూర్ కి కాల్స్ చేస్తున్నారట. కానీ బోని కపూర్ మాత్రం తమిళ ఇండస్ట్రీలో జాన్వీ ని అజిత్ తోనే లాంచ్ చేయించాలని భావిస్తున్నడట. ఒకవేళ అది అవ్వని పక్షంలో ధనుష్ ,విజయలలో ఒకరితో స్క్రీన్ కెమిస్ట్రీ చేయవచ్చు. టాలీవుడ్లో మాత్రం తారక్ సినిమా వచ్చేవరకు జాన్వి మరో ఫిలిం సైన్ చేయకపోవచ్చు. అందుకు తగ్గినట్టుగా బోనీ ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు. ఇక సౌత్ ఆడియన్స్ సైతం శ్రీదేవి కూతురని ట్యాగ్లైన్ చూసి ప్రాంతీయ సినిమాల్లో అలనాటి బ్యూటీ క్వీన్ గుర్తుకు తెస్తుందని అని ఆశగా ఎదురుచూస్తున్నారు. 

Tags:    

Similar News