టాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ.. ఈసారి ఏ స్టార్ హీరోనో తెలుసా..?

అలనాటి అందాల తారా, స్టార్ హీరోయిన్ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2023-04-17 09:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి అందాల తారా, స్టార్ హీరోయిన్ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ నటిస్తుంది. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే.. టాలీవుడ్‌లో మరో భారి ప్రాజెక్ట్‌కు జాన్వీ ఒకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. దీనికి హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను సంప్రదించినట్లు వార్తులు వినిపిస్తున్నాయి. అయితే ఆమె కూడా ఈ ప్రపోజల్‌కు దాదాపుగా ఒకే చెప్పేసిందట. అదే కనుక నిజం అయితే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన నటించే అరుదైన అవకాశం జాన్వీ సొంతం చేసుకున్నట్లు అవుతుంది. కాగా.. కాబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ సినిమాలో.. రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడని టాక్. ఇందులో ఒక హీరోయిన్‌గా జాన్వీ, మరో హీరోయిన్‌గా మృణాల్ ఠకూర్‌ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read More:   మహేష్ బాబుకు క్రేజీ డిసీజ్.. షాక్‌లో ఫ్యాన్స్! 

Tags:    

Similar News