మద్యం మత్తులో కారు డ్రైవర్‌ను మరిచిపోయిన Janhvi Kapoor ..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అతిలోక సుందరి డాటర్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Update: 2022-12-07 11:12 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అతిలోక సుందరి డాటర్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మూవీస్‌తో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె బోల్డ్ డ్రెస్సింగ్‌తో ఎప్పుడు హట్ టాపిక్‌గా మారుతుంది. ఇక ప్రస్తుతం జాన్వీ నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురవుతుంది. రెస్టారెంట్ నుండి బయటకు వచ్చిన జాన్వీ తన కారు ఎక్కడుందో, తన డ్రైవర్ ఎక్కడున్నాడో కూడా గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో జాన్వీ మాత్రం ఈ లోకంలో ఉన్నట్లు కనిపించట్లేదు. తన కారు ఎక్కడుందో కూడా గుర్తు పట్టలేకపోయింది. 'నా కారు ఎక్కడుంది..?' అని అందరినీ అడిగేస్తూ.. తన డ్రైవర్ వెనకాలే ఉన్నా కూడా గుర్తుపట్టలేనంత మైకంలో ఉండిపోయింది. దీంతో జనాలు 'బాగానే తప్ప తాగినట్లుంది' అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు.

Read more:

బెడ్ రూమ్‌లో ఫోర్స్ చేస్తున్న భార్య.. తట్టుకోలేక కోర్టును ఆశ్రయించిన భర్త

Tags:    

Similar News