పదేళ్లకే ఫొటో మార్ఫింగ్ చేసి నెట్టింట పెట్టారు.. స్కూల్‌లో తల ఎత్తుకోలేకపోయా

యుక్త వయసులో ఎదురైన ఫొటో మార్ఫింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై స్టార్ కిడ్ జాన్వీ కపూర్ ఓపెన్ అయింది.

Update: 2023-09-29 09:14 GMT

దిశ, సినిమా: యుక్త వయసులో ఎదురైన ఫొటో మార్ఫింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై స్టార్ కిడ్ జాన్వీ కపూర్ ఓపెన్ అయింది. రీసెంట్‌గా ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియా ఎఫెక్ట్ తనపై ఎలాంటి ప్రభావం వేస్తుందో వివరిస్తూ స్కూల్ దశలోనే తనను ఫొటో గ్రాఫర్లు వెంటాడేవారని చెప్పింది. ఈ క్రమంలోనే స్కూల్ ముందు తనకోసం కెమెరాలు పట్టుకుని వెయిట్ చేస్తున్న వారిపై తాను సీరియస్ అయినందుకు ప్రతికారంగా తన ఫొటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట షేర్ చేశారని వాపోయింది. ఈ ఎఫెక్ట్‌తో కొంతకాలం చాలామంది పిల్లలు తనతో డిస్టెన్స్ మెయింటెన్ చేశారని, ఇప్పటికీ కెమెరాలు తన జీవితంలో ఒక భాగమయ్యానని వాపోయింది. ‘చిన్నతనం నుంచే కెమెరాలు నా చుట్టూ ఉన్నాయి. బయటికి వెళ్లాలంటే భయమేసేది. పర్మిషన్ లేకుండానే వెంటపడి ఫొటోలు తీసేవారు. 10 ఏళ్లకే స్కూల్ కంప్యూటర్ ల్యాబ్‌లో ఇంటర్నెట్‌లో ఖుషి, నా పిక్స్ చూసి చాలా ఆందోళన చెందాము. మా మమ్మల్ని స్నేహితులు వింతగా చూసారు. ఎగతాళి చేశారు’ అంటూ జాన్వీ ఎమోషనల్ అయింది.


Tags:    

Similar News