Janhvi Kapoor: వాటి కల్చర్ అదే.. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు.. జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

Update: 2024-07-22 10:38 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్న ఈమె.. దీంతో పాటు మరో రెండు మూడు చిత్రాలు లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. జాన్వీ నటిస్తున్న తాజా మూవీ ‘ఉలఝ్’ రిలీజ్‌కు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న బ్యూటీ.. సోషల్ మీడియా వేదికగా స్టార్ కిడ్స్‌పై వస్తున్న విమర్శలపై స్పందించింది.

ఆమె మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటి కల్చర్ అదే కాబట్టి. మనం పబ్లిక్ ఫిగర్ అయినా, కాకపోయినా ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అలాంటి విమర్శలకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఒక ఇష్యూపై ఈ రోజు పొగిడిన వాళ్లు.. అదే ఇష్యూపై రేపటి రోజున తిడతాడు. అందుకే అవన్ని పట్టించుకోకూడదు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ జాన్వీ కపూర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News