Ananth Ambani - Radhika Merchant : అంబానీ పెళ్లిలో ఫుల్లుగా లాగించేసిన హీరోయిన్.. ప్రస్తుతం కూర్చోలేని నిల్చోలేని పరిస్థితి...
బ్యూటిఫుల్ జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ ' దేవర ' తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ తర్వాత చెర్రీ - బుచ్చిబాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా నాని సరసన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
దిశ, సినిమా: బ్యూటిఫుల్ జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ ' దేవర ' తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ తర్వాత చెర్రీ - బుచ్చిబాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా నాని సరసన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకముందే మూడు సినిమాలు సైన్ చేసిన లక్కీ హీరోయిన్ అనిపించుకుంటుంది. మొత్తానికి ప్రొఫెషనల్ లైఫ్ అద్భుతంగా ఉండగా.. పర్సనల్ లైఫ్ మరింత అమేజింగ్ గా డిజైన్ చేసుకుంది. ఇప్పటికే మాజీ సీఎం మనవడిని ఓకే చేసుకోగా... ఇక పెళ్లే తరువాయి అన్నట్లు ఉంది.
ఇదిలా ఉంటే జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియా.. కొత్త పెళ్లి కొడుకు అనంత్ అంబానీ ఫ్రెండ్ కూడా. అందుకే మ్యారేజ్ లో అన్ని పనుల్లో చేదోడుగా అంటూ సందడి సందడిగా తిరిగాడు. జాన్వీ కూడా రోజుకో మెస్మరైజింగ్ ఔట్ ఫిట్ తో నెటిజన్ల మనసు దోచేసింది. అంతా బాగానే ఉన్నా తాజాగా ఈ బ్యూటీ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు తెలుస్తుంది. అభిమానులు త్వరగా కోలుకోవాలని అంటుంటే.. నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంబానీ పెళ్లిలో వెనుకా ముందు ఆలోచించకుండా ఫుడ్ లాగించేసి ఉంటుందని.. అందుకే ఫుడ్ ఇన్ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరిందని కామెంట్స్ చేస్తున్నారు.