సెక్స్‌లో నా ఉద్వేగం చూపించమని దర్శకుడు తనతో పడుకోమన్నాడు
అమెరికన్ యాక్ట్రెస్ జేన్ సేమౌర్ ఫోండా.. ఫ్రెంచ్ దర్శకుడు రెనే క్లెమెంట్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
దిశ, సినిమా : అమెరికన్ యాక్ట్రెస్ జేన్ సేమౌర్ ఫోండా.. ఫ్రెంచ్ దర్శకుడు రెనే క్లెమెంట్‌పై సంచలన ఆరోపణలు చేసింది. 1964లో రెనే తెరకెక్కించిన ఫ్రెంచ్ మిస్టరీ-థ్రిల్లర్ ‘జాయ్ హౌస్’లో కథానాయికగా నటించిన ఆమె.. సినిమా షూటింగ్ టైమ్‌లో లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. ‘‘జాయ్ హౌస్’ చిత్రీకరణ సమయంలో ఫ్రెంచ్ దర్శకుడు రెనే క్లెమెంట్ తనతో పడుకోమని అడిగాడు. అంతేకాదు సినిమాలో నా పాత్ర ఉద్వేగభరితంగా ఉండాలన్నాడు. రొమాన్స్ సీన్స్ సమయంలో భావప్రాప్తి పొందినపుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలన్నాడు. దానికోసం తనతో బెడ్‌పైకి రావాలని విసిగించాడు’ అని గతాన్ని గుర్తుచేసుకుంది. అయితే తాను అంగీకరించలేదని, సినిమా నుంచి తప్పుకుంటానని సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఆయన వేధింపులు ఆపినట్లు తెలిపింది.
Read more: