ఆడిషన్‌లోనే సెక్స్ చేయాలని కోరిన నిర్మాత.. సుఖంగా అనిపించలేదన్న నటి
బ్రిటీష్ యాక్ట్రెస్ జమీలా జమీల్.. ఇంటిమేట్ సీన్స్‌లో నటించడం ఇష్టం లేక ఓ బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిపింది.
దిశ, సినిమా: బ్రిటీష్ యాక్ట్రెస్ జమీలా జమీల్.. ఇంటిమేట్ సీన్స్‌లో నటించడం ఇష్టం లేక ఓ బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ పేరుగాంచిన సంస్థ తెరకెక్కిస్తున్న క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ నాల్గవ సీజన్ కోసం ఆడిషన్‌కు వెళ్లినట్లు చెప్పిన నటి.. అందులో సెక్స్ సన్నివేశాలుంటాయని షరుతులు పెట్టడంతో మొహమాటం లేకుండా ఆడిషన్ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పింది.
అయితే మొదట తన పాత్ర సెక్సీగా ఉంటుందని చెబితే ఎగ్జయిట్ అయ్యానన్న హాటీ.. తర్వాత న్యూడ్‌గా శృంగారం చేయాలని చెప్పడంతో ఆందోళన చెందినట్లు తెలిపింది. ‘నిజానికి నేను చాలా సిగ్గరిని. నా బాడీని చూపించడం కంఫర్ట్‌గా అనిపించదు. ఆ నరకం అనుభవించలేను. ఇంతకాలం సరిహద్దులు గీసుకోకుండా నటించాను. కానీ, ఇకపై నన్ను నేను రక్షించుకుంటాను. అది అవమానం కాదు. కానీ, సెక్స్ చుట్టూ ఇబ్బందికరమైన విషయం ఉందని నేను భావిస్తున్నా’ అని వివరించింది.
Also Read.. ‘మహాభారతం’ ఏకంగా 10 పార్ట్‌లలో.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్