ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది గోట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు.
దిశ, సినిమా: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘THE GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ‘ది గోట్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు వస్తున్నట్లు తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు ‘ఓ సింహం.. గోట్‍గా మారడం ఎప్పుడైనా చూశారా? దళపతి విజయ్ ది గోట్ - ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్ మూవీ నెట్‍ఫ్లిక్స్‌లోకి అక్టోబర్ 3వ తేదీన రానుంది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‍ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.