అదంతా విష ప్రచారమే.. ఆ వార్తలపై Samantha టీమ్ క్లారిటీ!

స్టార్ హీరోయిన్ సమంత తను పూర్తిగా సినిమాలనుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించింది.

Update: 2022-12-21 06:10 GMT

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ సమంత తను పూర్తిగా సినిమాలనుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించింది. మయోసైటిస్ వ్యాధి సోకిన కారణంగా నటనకు స్వస్తి చెప్పాలని ఫిక్స్ అయిందని, ఇకపై తనను సినిమాల్లో చూడలేమంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె పీఆర్ టీమ్ తేల్చి చెప్పింది. అవన్నీ పూర్తిగా అవాస్తవమని ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు సంక్రాంతి తర్వాత విజయ్ దేవరకొండతో 'ఖుషీ' సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతుందని, అనంతరం తాను ఒప్పుకున్న హిందీ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇక 'సినిమా షూటింగ్‌ కోసం దర్శకనిర్మాతలను వేయిట్ చేయించడం పద్ధతి కాదు. ఒకవేళ సామ్‌కు షూటింగ్‌లో పాల్గొనడం సాధ్యం కాకపోతే..వారి షెడ్యూల్ ప్రకారం షూటింగ్స్ పూర్తి చేసుకోమని ముందే స్పష్టం చేశాం. ఇప్పటిదాకా సమంత ఒప్పుకున్న ఏ ప్రాజెక్టు నుంచి తప్పుకోలేదు. కొత్త సినిమాలు ఏవీ కూడా ఒప్పుకోలేదు. సమంత తర్వాతి చిత్రాల విషయంలో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు' అని సమంత పీఆర్ టీమ్ పుకార్లకు చెక్ పెట్టింది. 

Also Read....

ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న Anchor Pradeep ! 

Tags:    

Similar News