‘పుష్ప 2’ లో ఐటెమ్ సాంగ్.. హాట్ టాపిక్‌గా సాయి పల్లవి వీడియో..!
సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
దిశ, సినిమా: సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో ఐటెమ్స్ అంటే ప్రత్యేకంగా హాట్ బ్యూటీస్‌ను ఎంచుకుని చేసేవారు. కానీ ఇప్పుడు.. ఓ పక్క వరుస సినిమాలతో బిజీగా ఉంటూ.. స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మలు కూడా ఇప్పుడు ఐటెమ్ సాంగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. వీరిలో ‘జనత గ్యారేజ్’లో కాజల్ అగర్వాల్, ‘రంగస్థలం’లో పూజా హెగ్డే, ‘పుష్ప’లో సమంత ఐటెమ్స్ సాంగ్స్ చేసి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో హీరోయిన్ ఇప్పుడు స్పెషల్ సాంగ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు. టాలీవుడ్ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి.
ఈమె నేచురాలిటీకి, యాక్టీంగ్‌కు, ముఖ్యంగా డ్యాన్స్‌కు ఎవరైన ఫిదా అవ్వా్ల్సిందే. దీంతో సాయిపల్లవి, అల్లు అర్జున్ కలిసి డ్యాన్స్ చేయాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ కోసం సాయి పల్లవిని కలిశారట. అయితే.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం విన్న కొంత మంది సాయి పల్లవి ఐటెమ్ సాంగ్ చేయడమేంటని ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు మాత్రం సాయిపల్లవి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూను వైరల్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో పూజ హెగ్దే, సమంత లాగా మీకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వస్తే చేస్తారా అని యాంకర్ ప్రశ్నించగా.. ‘నాకు స్పెషల్ సాంగ్స్ అంత కంఫర్ట్ అనిపించవు’ అంటూ రిప్లై ఇచ్చింది సాయి పల్లవి. దీంతో ఇప్పుడు వచ్చే వార్తలు రూమర్సే అయుంటాయని కొట్టి పడేస్తున్నారు నేచురల్ బ్యూటీ ఫ్యాన్స్.