అతనికి తల్లిగా నటించాలంటే నా ఇగో ఒప్పుకోలేదు.. అయినా భరించాను: మనీషా
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌కు తల్లిగా నటించడం అసలే నచ్చలేదంటోంది సీనియర్ నటి మనీషా కొయిరాలా. ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీలో కృతిసనన్ హీరోయిన్గా నటించగా మనీషా హీరోకు అమ్మ పాత్ర పోషించింది
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌కు తల్లిగా నటించడం అసలే నచ్చలేదంటోంది సీనియర్ నటి మనీషా కొయిరాలా. ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీలో కృతిసనన్ హీరోయిన్గా నటించగా మనీషా హీరోకు అమ్మ పాత్ర పోషించింది. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడుతూ.. ‘నేను కమర్షియల్ డ్రామాలోనే నటించాలనుకుంటున్నా. అందులో భాగంగానే ‘షెహజాదా’లో కార్తిక్‌కు తల్లి పాత్రను ఎంచుకున్నా. సినిమా ప్రారంభం నుంచి ప్రధాన పాత్ర పోషించడం, ముఖ్యంగా ఇలాంటి క్యారెక్టర్ రోల్ కొంచెం కఠినమైనది. నిజంగా చెప్పాలంటే నా కెరీర్ మొదటి రోజులను గుర్తచేసుకుంటే ఈ క్యారెక్టర్లో కనిపించడానికి నా ఇగో ఒప్పుకోలేదు. చాలా కష్టంగా అనిపించింది. కానీ పెద్దయ్యాక గత అనుభవాలు చాలా పాఠాలు నేర్పిస్తాయి’ అంటూ చెప్పుకొచ్చింది.