ఆ బాధ మర్చిపోవడానికి చాలా సమయం పట్టింది.. Namratha ఎమోషనల్

ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్, మహేష్ బాబుతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది..

Update: 2023-01-22 04:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్, మహేష్ బాబుతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. కానీ, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా, నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ''గౌతమ్ నన్ను విడిచి ఫస్ట్ టైమ్ ఫారిన్ కల్చరల్ ట్రిప్‌కి వెళ్లాడు. నాలో ఓ భాగం దూరం అవుతున్న ఫీలింగ్ వచ్చింది. దీన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. రోజంతా శూన్యంగా ఉంది. గౌతమ్ తిరిగి మళ్లీ కళ్ల ముందు కనిపించే వరకు ఆ బాధ తీరదు. మా బుజ్జి కన్నకు రెక్కలొచ్చి ఎగిరిపోయాడు. ఈ ట్రిప్ నీకు ఎన్నో అనుభవాలను ఇవ్వాలని కోరుకుంటున్నా. నీ కోసం ఎదురుచూస్తూ ఉంటా'' అని రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : పోలీసులపై 'కలర్ ఫొటో' హీరోయిన్ సీరియస్..

Tags:    

Similar News