పవన్- బండ్ల గణేష్ మధ్య మొదలైన వైరం? చర్చనీయాంశమైన నిర్మాత ట్వీట్స్
స్టార్ హీరో పవన్ కల్యాణ్, నిర్మాత బండ్ల గణేష్‌కు మధ్య ఏదో వైరం మొదలైనట్లు తెలుస్తోంది.
దిశ, సినిమా : స్టార్ హీరో పవన్ కల్యాణ్, నిర్మాత బండ్ల గణేష్‌కు మధ్య ఏదో వైరం మొదలైనట్లు తెలుస్తోంది. పవన్‌ను తన ఆరాధ్యదైవం అంటూ పొగిడిన బండ్ల ఇప్పుడు 'నా విశ్వరూపం చూపిస్తా' అంటూ హీరోకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. విషయానికొస్తే.. ఇటీవల 'ఆన్‌స్టాపబుల్'లో పాల్గొన్న పవన్ 'గబ్బర్ సింగ్' సినిమాకు అనుకున్నంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదని చెప్పడం గణేష్‌కు మింగుడుపడలేదట. ఎందుకంటే ముందు మాట్లాడుకున్నట్లే ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చానని, కానీ, పవన్ మాటలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రవితేజను పొగిడేస్తూ 'కళ్లల్లో కసి, మీసంలో పౌరుషం, ముక్కు మీద రాజసం' అంటూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. 'ఏంది బండ్లన్నా.. దేవరను మరిచావా? భక్తి తగ్గిందా? నీ బండి రవితేజగారి రోడ్డులోకి మళ్లింది' అని ప్రశ్నించారు. దీనికి రిప్లై ఇచ్చిన నిర్మాత 'నేను హిందువుని. శ్రీశైలం వెళ్తాను. తిరుపతి వెళ్తాను. శబరిమల కూడా వెళ్తాను' అంటూ రాసుకొచ్చాడు. కాగా పవన్ మీద గణేష్ రివేంజ్ తీసుకుంటాడా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.